- లింగంపల్లి రైల్వేస్టేషన్ ను సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే జెడ్.ఆర్.యూ.సి.సి సభ్యుడు డి. కాశీనాథ్
- స్టేషన్ మేనేజర్ తో కలిసి స్టేషన్ పరిసరాల, సమస్యల గుర్తింపు
- ప్రయాణికుల నుంచి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ
నమస్తే శేరిలింగంపల్లి : నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జెడ్.ఆర్.యూ.సి.సి సభ్యుడు డి. కాశీనాథ్ సందర్చించారు. స్టేషన్ పరిసరాలను, అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. ఆయనతోపాటు స్టేషన్ మేనేజర్ ఏ.రాజు, చీఫ్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ ఎన్. మధు కుమార్, రైల్వే సిబ్బంది తదితరులు ప్రయాణికులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- ప్రయాణికుల నుంచి అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు
- కవరింగ్ ప్లాట్ ఫామ్ లేక ఎండకు వానకు ఇబ్బందులు పడుతున్నామని, ఏర్పాటు చేయాలని కోరారు.
- రైల్వే కూలి ఒక్కరే ఉన్నారని, మరొక ఐదుగురిని నియమించాలన్నారు.
- అసంపూర్తిగా ఉన్నా పర్సనల్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలని, బిహెచ్ ఈఎల్ వరకు బస్ సౌకర్యం కల్పించాలని, స్టేషన్ రావడానికి అప్రోచ్ రోడ్ వేయాలని వారి దృష్టికి తెచ్చారు.
- లాక్ రూం సౌకర్యం కల్పించాలని కోరారు. వీటికి అధికారులు సానుకూలంగా స్పందించారు. స్టేషన్ లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు.