- ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తేండి
- కాలనీవాసులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ హామీ
నమస్తే శేరిలింగంపల్లి : హైదరనగర్ డివిజన్ ఆదిత్య నగర్ , అడ్డగుట్ట కాలనీ అసోసియేషన్ సభ్యులతో కాలనీలో పార్కులు మౌలిక వసతుల అభివృద్ధిపై శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అంబిర్ చెరువు, ప్రభుత్వ భూములు, కాలనీలోని పార్కు స్థలాలు కబ్జా గురైన విషయాలను కాలనీ అసోసియేషన్ సభ్యులు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ఎవరైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండాలని, తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, భారత్, భగవాన్, నాయుడు, ఎస్.వి.రావు, సాయి రాజు, వాసు, లక్ష్మణ్ రావు, వెంకటేష్, రంగనాధ్ రాజు, నాగేశ్వరరావు రావు, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, జివి రెడ్డి, రాజీ రెడ్డి, శ్రీకాంత్, ఫాయజ్, ప్రభాకర్, భీమ్ రావు, రాజు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.