నమస్తే శేరిలింగంపల్లి : మియపూర్ డివిజన్ పరిధిలోని ఓం కార్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటించి ప్రజల సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బస్తివాసులు తమ గోడును వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృదే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి బస్తి/కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, మనెపల్లి సాంబశివరావు, తిరుపతి, రవి కుమార్, గిరి, సాయి, హర్ష పాల్గొన్నారు.