ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటాం 

  • కంటికి రెప్పలా కాపాడుకుంటాం
  •  శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కృతఙ్ఞత సభ లో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
  • ఎంపీ ఎన్నికల్లో మరింత కష్టపడదామని పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తల కృతజ్ఞత సభ ఘనంగా జరిగింది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో నిర్వహించిన కృతఙ్ఞత సభలో మాట్లాడుతున్న ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి గడ్డ గులాబీ అడ్డ అని ఎమ్మెల్యే గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని, అదే స్ఫూర్తితో రాబోయే ఎంపీ ఎన్నికలో చేవెళ్ల లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీకి శ్రీ రామ రక్ష అని, ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

కృతఙ్ఞత సభ అనంతరం భోజన కార్యక్రమంలో ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీ ఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు

సభలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here