నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
స్థానిక ఇళ్ల పట్టాలు, మంజీర పైప్ లైన్, నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఇలియస్ షరీఫ్, సాంబశివరావు, మడిమిట్టి కృష్ణ, భాస్కర్ గౌడ్, రామచందర్, రమేష్, ప్రభాకర్, శంకర్, సాయి, రమేష్, రవి కుమార్, ఆసిఫ్, అరుణ్, సాయి కుమార్ గౌడ్, వేణు, రాజు, ప్రదీప్, రాంబాబు, సురేష్, నవీన్, ప్రవీణ్ కుమార్, ఉదయ్, వెంకట్, మహిళలు కవిత, గీత, విజయలక్ష్మి, వాసవి, లావణ్య పాల్గొన్నారు.