కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకాష్ జ్యువల్లరీ షాప్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ షాపు వారు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలన్నారు. నాణ్యమైన ఆభరణాలను తయారు చేసి అందివ్వాలన్నారు. ఈ సందర్బంగా ఆయన యజమానులు లుంబా రామ్, మనోజ్ కుమార్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, జనరల్ సెక్రెటరీ రమణ, తెరాస నాయకులు కృష్ణయ్య, కత్తుల శ్రీనివాస్, రామచంద్రయ్య, యూత్ నాయకులు రఫీ, కన్నయ్య, కాశీనాథ్ పాల్గొన్నారు.