నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గోపనపల్లిలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చదువు ఒక గొప్ప ఆశయంతో కొనసాగించాలని, ఆశయం పెట్టుకుని దానికనుగుణంగా శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
నూతన సంవత్సరం అందరికీ శుభం జరగాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతూ మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ, ఉపాధ్యాయునిలకు, విద్యార్థులకు, దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ ప్రదీప్, ప్రశాంత్, స్వప్న, జయ, అమరిన్, లత, స్వర్ణ కుమారి, సునీత, భారతి, వసంతి, అంజలి, రమ్య, సినీ దర్శకుడు పెద్దరాజుల మధు, యాక్టర్ శ్రీ యాదవ్, సినీ దర్శకుడు తలారి పవన్ పాల్గొన్నారు.