నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారథ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమస్వరార్చన, నృత్యార్చన కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి నృత్య కైంకర్యం వేడుకగా జరిగింది.
అంతకుముందు శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం లలిత ఫైన్ ఆర్ట్స్ అకాడమీ గురువు లలిత ధనలక్ష్మి, వారి 30మంది శిష్యులు సంజన ప్రియ, ఐశ్వర్య, సుధా కృతి, శర్వాణి, వర్షిత, సుదీక్ష, శెహరి, దీక్షిత, త్రివేద, లాస్య, తన్మయి, శాన్వి, సుప్రన్య, శన్విజ, అనన్య లక్ష్మి, భావన్య, దేవైశి, నక్షత్ర, తేజశ్రీవల్లి, అనిక, దృగ్విత, తనిష్క, చరిష్మ, మిధునశ్రీ, కృతిక, అభిఘ్న, గానప్రియ సంయుక్తంగా సంకీర్తనలకు తమ తమ నృత్య ప్రదర్శనలతో అందరిని అలరించారు. ఇందులో భాగంగా, “వినాయక కౌతం, మూషిక వాహన, కృష్ణ కలయ సఖి, అష్టలక్ష్మీ స్తోత్రం, బ్రహ్మమొక్కటే, ఫరజ్ తిల్లానా, రుక్మిణీ ప్రవేశం, కళ్యాణ రామ, లలిత దేవి,” వంటి ప్రముఖ సంకీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చి, ప్రసాద వితరణతో కార్యక్రమాన్ని ముగించారు.