
ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీకి చెందిన ఖాజా మొయినుద్దీన్(45) ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టీఆరెస్ యువ నాయకుడు రామ కృష్ణ గౌడ్, డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేష్ చంద్ర , నాయకులు రాము గౌడ్, నాగేశ్వరరావు , జనార్ధన్, వాసు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.





