- రాజేంద్రనగర్ బక్షి కుంట చెరువు అభివృద్ధి పనుల పరిశీలనలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో సీఎస్ఆర్ లో భాగంగా ఫెనోమ్ పీపుల్ ఐటి కంపెనీ, బైరేడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బక్షికుంట చెరువు సుందరీకరణ పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులో ఎటువంటి వ్యర్థాలను పడేయకుండా కాలనీవాసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులలో మట్టి, రాళ్లు, చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బైరేడ్డి ఫౌండేషన్, ఫేనోమ్ పిపుల్స్ ఐటి కంపెనీ సభ్యులు శర్వానంద్, రాము, చైతన్య పాల్గొన్నారు.