నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ శాసనసభలో శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని, నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.