నమస్తే శేరిలింగంపల్లి : సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ నాయకులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ విచ్చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ప్రజలు ఆదరించి , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సహాయం రూ. 10 లక్షల రూపాయలు పథకాన్ని ప్రారంభించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్యరంగంలో చాలా మార్పులు తీసుకువచ్చి రోగులకు అందుబాటులో వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు చేయబోతుందని తెలిపారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినందుకు వెంకట్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సంగారెడ్డి, జంగం గౌడ్, లంబు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.