రైలు విహార్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రైలు విహార్ కాలనీలో ఆదివారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రధానంగా యూజీడీ సమస్య, మంచినీటి సమస్య నెలకొని ఉందని కాలనీ వాసులు వాపోయారు. అప్పటికప్పుడు స్పందించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వాటర్ వర్క్స్ జీఎంతో ఫోన్ లో మాట్లాడి రైలు విహార్ కాలనీకి మంజీరా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైలు విహార్ కాలనీవాసుల‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

యూజీడీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు కాలనీ వాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బలరాం, ముత్తుస్వామి, ఈశ్వర్ రావు, నవీన్, సంతోష్ పాల్గొన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here