నమస్తే శేరిలింగంపల్లి: భారతి నగర్ డివిజన్ లోని ఓల్డ్ ఎం.ఐ.జిలో నిర్వహించిన రోడ్ షో, బైక్ రాలీ ప్రజల మద్దతు కూడగట్టుకున్నది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు.
తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, మార్పు కోరుకుంటున్నారని, ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టే సూచనలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.