నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి చందానగర్, వేంకటేశ్వర కాలనీలలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనుబంధ సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాలనీలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సంక్షేమ బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం, ఆసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవరావు, రఘుపతిరెడ్డి, లక్ష్మినారాయణగౌడ్, జనార్ధన్ రెడ్డి, ఓర్సు వెంకటేశ్వర్లు, పారునంది శ్రీకాంత్, ప్రీతమ్, సుబ్బారావు, హరీష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగకృష్ణ, వరలక్ష్మి,అవినాష్ రెడ్డి, సాయిబాబా, శ్రీనివాస్ రెడ్డి, దత్తు, యర్వ వెంకటేశ్ పాల్గొన్నారు.