- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ సగర సంఘం
బద్వేల్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర కార్పొరేషన్ ఛైర్మన్ గానుగపెంట రమణమ్మ శ్రీనివాస్ సగర, డైరెక్టర్ మురళీ సగరలను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఘనంగా సన్మానించింది. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల భిక్షపతి సగర, ఉపాధ్యక్షుడు చిలుక సత్యం సగర, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగరలు శనివారం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ లో ఉన్న రమణమ్మ శ్రీనివాస్ సగర ను మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగర జాతిని గుర్తించి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఛైర్మన్, 12 మంది డైరెక్టర్ లను నియమించడం పై హర్షం వ్యక్తం చేశారు. రాభోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగర కార్పొరేషన్ కు అత్యధిక నిధులు కేటాయించి సగరుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేయాలని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాణించేందుకు సగరులు సగరులు సంఘటితాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలంగాణ సగర సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.





