- కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ భారీ ఎత్తున కార్యకర్తలతో రోడ్ షో
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ లోని రాయదుర్గం నుండి ఖాజాగూడ మీదగా నానక్ రామ్ గుడా, గౌలిదొడ్డి, గొప్పంపల్లి, ఎన్టీఆర్ నగర్, లంబాడి తండా, నల్లగండ్ల వరకి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎం .ఎల్ .ఏ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ భారీ ఎత్తున కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు
మహిళలు ముందుకి వచ్చి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ముందుకి సాగారు. 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.