- శేరిలింగంపల్లిలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై ప్రచారం
- విజయవంతమైన నిపుణుల సమావేశం.. రోడ్ షో
నమస్తే శేరిలింగంపల్లి : ఎల్లపుడూ అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేసి చూపిస్తాం.. ఆశీర్వదించండి.. అంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆళిండ్ అల్యుమినియం ఫ్యాక్టరీ నుండి క్రిష్టల్ గార్డెన్స్ వరకు నిర్వహించిన రోడ్ షో, నిపుణులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నమలై , చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30న కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఒక్క వారం కష్టపడి పనిచేస్తే గెలుపు ఖాయమని, రోజుకి ఒక్కొక్కరూ 100 మందిని కలిసి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలో వివరించాలని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.