నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం 108 మియాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీ, వెంకటేశ్వరనగర్, వెంకట్ బ్లాక్, శృతి, ప్రియాంక, ఆర్ బి ఆర్ కాంప్లెక్స్, బాలాజీనగర్, శ్రీ సత్త లక్ష్మీనగర్, దత్త సాయినగర్, అరబిందో కాలనీ శ్రీరంగాపురం కాలనీలలో పలు అపార్ట్ మెంట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అన్ని వర్గాల సంక్షేమం కోసమే ఆరు గ్యారెంటీ పథకాలు పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టిసి నాయకులు, మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.