- కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: జగదీష్ అన్నతోనే న్యాయం చేకూరుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి యూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, ఉద్యమ నాయకులు రంజిత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు ఆశీల శివ కుమార్, విక్రమ్ రెడ్డి, అడ్డగుట్ట శేరిలింగంపల్లి నివాసి బి.సాయి వెంకట్ కిరణ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఉద్యమాలు శేరిలింగంపల్లిలో చేశామని తెలిపారు. ఉద్యమకారులు మాట్లాడుతూ..జగదీష్ అన్న ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే ఉద్యమకారులకు సరైన న్యాయం జరుగుతుందని ఆరడుగుల బుల్లెట్టు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, మచ్చలేని నాయకుడు, ల్యాండ్ కబ్జాలు మోసపూరిత మాటలు జగదీశ్వర్ గౌడ్ కి రావని, చరిత్రలో వారి కుటుంబం సేవ కుటుంబమని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
ప్రస్తుత ఎమ్మెల్యేలు కబ్జాకోరులు, అవినీతిపరులు అన్న విషయం అందరికీ తెలుసని, కచ్చితంగా భారీ మెజార్టీతో జగదీష్ అన్నను గెలిపించుకుంటామని శివకుమార్ అన్నారు. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనను గెలిపించేందుకు వచ్చిన అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా తన ప్రస్తావన ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి తన గెలుపు గిఫ్టుగా ఇవ్వాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 3 తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. విద్యార్థి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. డిగ్రీ కాలేజీతో పాటు విద్యార్థులకు ఉద్యోగ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తానని, ఉద్యమకారులు కోరిన అన్ని సాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.