- కాంగ్రెస్ పార్టీలో చేరిక : బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి
- బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా
నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు అన్న.. సౌమ్యుడు
.. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తి జగదీష్ అన్న.. అని బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ లో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపించిందని, తాను టిఆర్ఎస్ పార్టీలో 2004వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు అలుపెరగకుండా ఒక కార్యకర్తగా పని చేశానని, రాష్ట్ర జనరల్ సెక్రటరీ యూత్ విభాగంలో శేరిలింగంపల్లి యువత అధ్యక్షుడిగా పనిచేశానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రోత్బలంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.
జగదీష్ అన్నని గెలిపించేందుకే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు పేర్కొన్నారు. జగదీష్ అన్న గెలిస్తే అభివృద్ధికి పట్టం కడతారని, పేదలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.