- క్రిస్టియన్ మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ సితార గార్డెన్ లో క్రిస్టియన్ మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ హాజరై మాట్లాడారు. లోక రక్షకుడు ఏసుప్రభు అని, క్రిస్టియన్లను భారతదేశంలో వ్యాప్తి చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో సహాయ సహకారాలు అందించిందని, ఈరోజు వారు తనకు మద్దతు తెలుపుతూ తన గెలుపు కోసం సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసి పిలిచినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
వారికి ఎల్లవేళలా తోడునీడగా ఉంటానని, క్రిస్టియన్ల అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తానని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మీ జగదీశ్వర్ గౌడ్ గా తనను గెలిపించి బహుమతిగా గా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.