నమస్తే శేరిలింగంపల్లి: అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభా రాజు ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి అన్నమ స్వరార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ సాయి సరస్వతి మ్యూజిక్ అకాడమీ సంస్థ గురువు శ్రీమతి జే. ఎన్. గిరిజా కుమారి వారి శిష్యులు “కే. మనస్విని, ఎం. ప్రణతి, ఈ. విద్య సాయి శ్రియ, పి. దుర్గ, ఎస్. సత్యలక్ష్మి అన్నపూర్ణ, ఎన్. సాయి షన్ముఖి, ఎమ్. షన్ముఖ అన్విత, సి. హెచ్. నాగ సాయి దీక్షిత, సి. హెచ్. సాయి రత్న హంసిని,పి. మేధజా సుబ్బలక్ష్మి, కే. చేతన్ సాయి” సంయుక్తంగా అన్నమ స్వరార్చన చేశారు.
తొలుత పద్మశ్రీ శోభా రాజు శిష్యులు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి, శ్రీ మత్వదీయ (గురుస్తుతి), అన్నమయ్య సంకీర్తనతో ప్రారంభించారు. తదుపరి గిరిజా శిష్య బృందం “అప్పని వారి ప్రసాది, ఆది మూలమే మాకు అంగరక్ష, అంతయు నీవే, వేదంబెవ్వని వెదెకెడిని, వాడే వెంకటాద్రి మీద, అవధరో రఘుపతి, నువ్వొక్కడివే నాకు చాలు, పూజలందరూ చేసేదే, అలమేలు మంగ, నమో నారాయణా నా విన్నపమిదిగో, చాలదా హరినామ, చిత్తజ గురుడా నీకు ఎక్కడ నున్నా, ఇంత చక్కని పెండ్లి కొడుకు, హరి అవతారమీతడు, తిరుమల గిరి రాయ, ఘోర దురితములచే, కొండలలో నెలకొన్న, వేడుకొందామా” అనే సంకీర్తనలను ఆలపిస్తూ స్వరార్చన చేశారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని సంస్థ అధ్యక్షులు డా. నంద కుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి అంగనలీరే హారతులు అనే మంగళ హారతి ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.