- జాతీయ విద్యా దినోత్సవంలో ఆచార్య కృష్ణయ్య రావుల
నమస్తే శేరిలింగంపల్లి: ఆధునిక విద్యకు ఆద్యుడు, సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేసిన మహోన్నతుడు భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని ఆచార్య కృష్ణయ్య రావుల అన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధురానగర్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య కృష్ణయ్య రావుల గారు (హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఈ సందర్భంలో భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.
ముఖ్యమైన అతిథి ఆచార్య రావుల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు వీటిని అందిపుచ్చుకోవాలంటే నైపుణ్యాలను పెంపొందించుకోవలసిన ఆవశ్యకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె. వెంకన్న, బి.రాఘవేందర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, జనార్ధన్, అమ్మయ్య చౌదరి, బాలన్న పాల్గొన్నారు.