నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవి కుమార్ యాదవ్ నామినేషన్ ర్యాలీ కి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్, మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అభిమానులు, ఆత్మీయులు, నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు మహిళా మోర్చా, యువమోర్చా, స్థానికులు బిజెపి అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ బాంధవులు అందరితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
వారు మసీద్ బండ , కొండాపూర్ కార్యాలయానికి నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రవి కుమార్ యాదవ్.. నాయకత్వం వర్ధిల్లాలి.. బిక్షపతి యాదవ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.