- డప్పు చప్పుళ్లు, దారిపొడవునా బ్యాండ్ మేళాలతో స్వాగతం
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆరెకపూడి శ్యామలదేవి నామినేషన్ దాఖలు
- భారీ ఎత్తున ర్యాలీ, పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,
- అడుగడుగునా నీరాజనం పలికిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు,
- మంగళ హారతులతో నీరాజనం పలికిన మహిళ సోదరీమణులు
నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నామినేషన్ దాఖలు అడుగడుగునా జన నీరాజనం నడుమ ఘనంగా జరిగింది. వివేకానంద నగర్ లోని తన ఇంటి నుండి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి భారీ డప్పు చప్పుళ్ళు, బ్యాండ్ తో పెద్ద ఎత్తున బైక్, కారు ర్యాలీగా బయలుదేరి వెళ్లగా.. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా.. మంగళ హారతులతో పలికిన మహిళ సోదరీమణులు స్వాగతం పలికారు.
అనంతరం రామాలయం, హైదర్ నగర్ లోని విజయదుర్గ మైసమ్మ టెంపుల్, గంగారాం లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుండి ర్యాలీగా వచ్చి శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్దకు చేరుకుని ఆనవాయితీగా అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. లింగంపల్లి లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కు పూలమాల వేసి ఘన నివాళులర్పించి. అక్కడి నుండి జోనల్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి కి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బీఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజా ఆశీర్వాదం, వారి దీవెనలతో రానున్న ఎన్నికల్లో బీఆర్ ఎస్ అఖండ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవీ రంగరావు, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
-
- ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆరెకపూడి శ్యామలదేవి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలదేవి తన నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు.