- సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రజలను కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరించారు.
కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే నని వారు ప్రజలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.