- పార్టీలో చేరిన వారికి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఊపందుకుంటున్నది. ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు తెలుపుతూ వివేకాంనందనగర్ డివిజన్ నుంచి మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అన్నారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని అన్నారు. పేద ప్రజల అభివృద్ధిని ఏనాడూ పట్టిచుకోలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి నవంబరు 30వ తేదీకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.