- సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న శేరిలింగంపల్లి ప్రజానీకం
- పార్టీలో చేరుతున్న పలు పార్టీల నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి స్వచ్చందంగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు. అంతేకాక ఆయన సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకులు వెంకటేష్ యాదవ్, రాజీ రెడ్డి, యాదగిరి గౌడ్, అర్జున్, విష్ణు, రాములు, శ్రీను, రామ్ బాబు, అబ్దుల్, సుందర్ రాజు, సి.హెచ్.వెంకయ్య, మాణిక్యం, బాలకృష్ణ, సూర్యనారాయణ, కిరణ్, ఎం.డి.జలీల్ తో కలిసి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
- బిఆర్ ఎస్ నుంచి
మరికొంతమంది జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ నుంచి తాండ్ర రాంచందర్ గౌడ్, ఏ సత్యం, నర్సింహ, కిరణ్ తోపాటు ఎం ఎ నగర్ నుంచి 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో సీనియర్ నాయకులు వీరమల వీరేందర్ గౌడ్, సంజీవ్ రెడ్డి, తిరుపతి ఉన్నారు.