అధైర్యపడొద్దు .. అండగా ఉంటాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించి , బాధితులకు ధైర్యం చెప్పి, పూర్తి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అగ్నిప్రమాదం వలన కూరగాయల షాపులు కాలిపోవడం చాలా బాధాకరమైన విషయం , ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని అన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరు అధైర్యపడకూడదని, ధైర్యంగా ఉండాలని, బాధితులకు అండగా ఉంటామని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్ , శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింత కింది రవీందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, కృష్ణ యాదవ్,ఖాజా పాషా, రవి యాదవ్, పవన్, ఫక్రుద్దీన్ , అజిమ్, లక్ష్మణ్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here