నమస్తే శేరిలింగంపల్లి : విజయదశమి పండుగ పురస్కరించుకొని సతీ సమేతంగా గత సంవత్సరం శిల్పాఎంక్లేవ్ పార్కులో, లక్ష్మీ గణపతి దేవాలయం పార్కులో జమ్మి మొక్కలను నాటారు. ఈసారి విశ్రాంతి ఉద్యోగులతో శిల్పాఎంక్లేవ్ పార్కులో పునాస మామిడి మొక్కను నాటారు.
అనంతరం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం వృక్షో రక్షతి రక్షతః అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు, ఎస్. రమేష్ , ఆర్. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.