నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో దసరా పర్వదినం సందర్భంగా మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా జరిగిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి, రజినీకాంత్, మార్వాడీ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.