నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికల నిర్వహణకు ఏఐసీసీ సీఈసీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా వచ్చిన కథనాలు అవాస్తవమని సోషల్ మీడియా తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ర్ట కో కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి పోస్టింగ్ లపై స్పందించవద్దని, అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి ఉండాలని సూచించారు.
పీసీసీ , కాంగ్రెస్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఇలాంటివి నమ్మవద్దని, ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ పోస్టింగులను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా శేరిలింగంపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.