- స్థానిక బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
నమస్తే శేరిలింగంపల్లి : ప్రముఖ సాంస్కృతిక సంస్థ స్వరమహతీ కళాపరిషత్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాలు, విద్యార్థినీ, విద్యార్థులు, నగరపుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బి. ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల సమహారమే బతుకమ్మ పండుగ అన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ముఖ్యమని సుమన్ టీవీ జీప్ ఎడిటర్ పికేశవ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివి బిజినెస్ గ్రూప్ అధినేత వైవివిఎస్ లక్ష్మణ్ కుమార్, సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ బి. కేశవరావు, యు శ్రీనివాసరావు, బి. సామ్యూల్, దేవులపల్లి కుమార్, బి. చంద్రభూషణ్, భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం చైర్మన్ తులసి రెడ్డి, మేక విజయలక్ష్మి, జ్యోతి, రాధ, మాయా బ్రహ్మం, జయప్రకాష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు, మహిళా సంఘాలకు ప్రత్యేక బహుమతులను విచ్చేసిన అతిధులు సంస్థ అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు.