నమస్తే శేరిలింగంపల్లి: అన్నమయ్యపురంలో నాద బ్రహ్మోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖులు జ్వాలా నరసింహారావు వనం, నాగసూరి వేణుగోపాల్, ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు సంస్థ అధ్యక్షులు నందకుమార్ సంయుక్త ఆధ్వర్యంలో నాద స్వరం, పూర్ణ కుంభం, జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు.
అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతి, “కొలిచితే రక్షించే గోవిందుడు” అనే కీర్తనతో ప్రారంభించిగా అనంతరం శంఖ నాదం, వేదాశీర్వాచనం నాదం స్వరంతో సంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం శోభా రాజు శిష్యురాలు దుర్గా సింధూర ఈ కార్యక్రమంలో “నమో నమో గణనాథ, పొడగంటిమయ్యా, శోడష కలల అలమేల్మంగమ్మ, సకల బలంబులు, గోవిందాశ్రిత” అనే కీర్తనలను పాడగా.. అనంతరం ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణ “నిత్య పూజలివిగో, పొడగంటిమయ్యా, నల్లని మేని, నగవులు నిజమని, జ్యో అచ్యుతానంద” అనే అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆశ్రితులు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల గురించి ఇంతగా ప్రచారంలో తీసుకుని వస్తున్న శోభా రాజుకు అభినందనలు తెలిపారు. తను పాడటమే కాకుండా దేశ విదేశాల్లో అందరిని పాడించడం అనేది చాలా గొప్ప శ్రమ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పారు. ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు, సంస్థ అధ్యక్షులు నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. చివరిగా అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి అంగనలీరే హారతులు ఇచ్చారు. పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.