- బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హామీలు నీటి మూటలే : మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి
- ఇటీవలే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కు బిఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకుస్థాపన
- మైనార్టీలదే అంటూ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పేరిటా శిలాఫలకం
- గత ఎన్నికల్లో షాదీఖానా హామీ ఏమైందంటూ విమర్శ
- మైనార్టీల కోసం నిర్మిస్తే మళ్ళీ కొత్త శిలాఫలకం ఏర్పాటు చేయాలని డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: గత ఎన్నికల్లో రూ.2కోట్లతో షాదీఖాన కు హామీ.. మళ్ళీ ఈసారి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పేరిటా శిలాఫలకం ఏర్పాటు.. బి ఆర్ ఎస్ ప్రభుత్వానికే చెల్లుతుందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. ఇటీవల మాదాపూర్ డివిజన్ ఖానమేట్ విలేజ్ లో ఎం.పీ నిధులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు బిఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారని బొబ్బ నవతారెడ్డి తెలిపారు.
ఎంపీ నిధులు ఉపయోగించుకుంటూ తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎం పి నిధులంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కాదా.. అని ఎద్దేవా చేశారు. మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పేరిట శంకుస్థాపన చేసి ముస్లిం మైనారిటీలదని చెప్పడం మళ్ళీ మోసం చేయడమేనని తెలిపారు.
మైనారిటీల కోసం అయితే మైనారిటీల ఫంక్షన్ హాల్ పేరిట మరో శిలా ఫలకం ఏర్పాటు చేయాలని మైనారిటీల తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.