నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ బాబా ఆధ్వర్యంలో.. అంబేద్కర్ విగ్రహం నుండి మంజీరా రోడ్డు, పాత ముంబై రోడ్డు, వేముకుంట వరకు గడప గడపకు జైపాల్ అన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జెరిపేటి జైపాల్ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అందించబోయే సంక్షేమ పథకాలు, గ్యారెంటీ హామీలను ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజన్, అజీముద్దీన్, అయాజ్ ఖాన్, ఫయాజ్, హరికిషన్, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ జాంగిర్, సురేష్ నాయక్, మారెల శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.