నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల మతాలకు అతీతంగా, ఎనలేని సంక్షేమ పధకాల అమలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, గాంధీ తెలిపారు.
కొండాపూర్ డివిజన్ మాదాపూర్ లోని విఠల్ రావు నగర్ లో రూ. 40 లక్షల అంచనా వ్యయంతో, శ్రీరామ్ నగర్ ఏ బ్లాకులో 18 లక్షల అంచనా వ్యయంతో, రాజా రాజేశ్వరి నగర్ కాలనీలో 44 లక్షల అంచనా వ్యయంతో, ప్రేమ్ నగర్ బీ బ్లాకులో 31 లక్షల అంచనా వ్యయంతోనూ, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు 86 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే అంతర్గత రోడ్ల పనులకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, జీహెచ్ఏంసీ అధికారులు, స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్, గాంధీ శంకుస్థాపన చేశారు.