- మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది
- మొదటి విడతలో 100 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.
మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా 100 మంది మైనారిటీ మహిళ సోదరీమణులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ లతో కలిసి కుట్టు మిషన్లను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద మహిళ ల జీవితాలలో వెలుగులు నింపిన రోజు ఇదని, మహిళలు తమ స్వంత కాళ్ళ పై నిలబడి కుటుంబ పోషణ కు చేదోడు వాదోడుగా ఉందేందుకు కుట్టు మిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు, వార్డ్ మెంబెర్లు, ఉద్యమకారులు, ఏరియా కమిటీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.