సమ సమాజ స్థాపనకు.. సమానత్వానికి డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ కృషి ఎనలేనిది : ప్రభుత్వ విప్ గాంధీ

  • గుల్ మోహర్ కాలనీ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగపల్లి : డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని, సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి గుల్ మోహర్ కాలనీ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసుల సహకారంతో వారి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమైన రోజని, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే అని అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ స్మారకం ఖ్యాతి గడించబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, గ్రంథలయా డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , గులమోహర్ కాలనీ ప్రెసిడెంట్ ఖాసీం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, చెన్నం రాజు, జంగయ్య యాదవ్, రాజు సురేందర్, గులమోహర్ కాలనీ వాసులు మోహన్ రావు టీవీ రావు, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఆనంద్ కుమార్, పెంటోజి, వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ, సత్యం, సుగుణ రావు, నాగన్న, ఎస్ ఏ అలీఖాన్, ప్రభాకర్ చారీ, నబి రసూల్, సమీర్ పటేల్, యూసఫ్, శేష సాయి, కాలనీ వాసులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here