- సాదరంగా ఆహ్వానించిన జేరిపాటి జైపాల్
నమస్తే శేరిలింగపల్లి : కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితుల సంఖ్య అధికమవుతున్నది. గచ్చిబౌలి డివిజన్ నుండి పలు కాలనీలలో నుంచి యువత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారిలో హరి, రాజు, కార్తీక్, రాజేష్ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని జేరిపాటి జైపాల్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారికి ఏ సమస్య ఉన్న అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు భరత్ గౌడ్, ఉమాకాంత్ , సూర్య రాథోడ్, పోచయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ తలారీ పాల్గొన్నారు.