- జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన మహిళలు
నమస్తే శేరిలింగంపల్లి : విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 వాగ్దానాలకు ఆకర్షితులై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ బస్తి వాసులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. గ్యాస్ బండ తమ జీవితాలకు గుది బండగా మారిందని మహిళలు వాపోయారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమకు సంక్షేమ ఫలాలు క్రమం తప్పకుండా అందాయని తెలిపారు. మళ్ళీ తమకు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని, మహిళలు కాంక్షించారు. ఈ కార్యక్రమంలో కనకలక్ష్మీ, రాజమ్మ, బాలమ్మ, గాయత్రి, మంగ, రాజు, సిద్దులు, రవి, కాంగ్రెస్ నాయకులు జహంగీర్, రాజేందర్, పోచయ్య, హరి, రాము, శివ పాల్గొన్నారు.