నమస్తే శేరిలింగంపల్లి : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలో ఓయూ కాలనీలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు మక్తల స్వామి గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. భారత ఉపప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాణక్యంతో నైజాం నవాబు, దాస్య శృంఖలాల నుంచి ఖాసీం రజ్వీ నియంతృత్వపు పోకడల నుండి విముక్తిని కలిగించారని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.