నమస్తే శేరిలింగంపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజులుగా అంగన్ వాడి ఉద్యోగులు సమ్మె చేపడుతున్న విషయం విదితమే. అయితే ఇందులో భాగంగా శేరిలింగంపల్లి మండల్ రెవిన్యూ ఆఫీస్ ఎదుట అంగన్ వాడీ ఉద్యోగుల సమ్మెకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల కోరికలు న్యాయబద్దమైనవేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్ వాడీల న్యాయబద్దమైన కోరికలను తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్ల అధ్యక్షులు యాదగిరి, సురేష్, జహంగీర్, మైనారిటీ నాయకులు అజీముద్దీన్, ముక్కయ్య పోచయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ తలారి పాల్గొన్నారు.





