- సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
నమస్తే శేరిలింగంపల్లి : దేశంలో, రాష్ట్రంలో, నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తులలో తానొక్కడినని సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్ టీఆర్ నగర్ లో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఆయన ఏర్పాటు చేసి దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు.
సేవ చెయ్యాలనే దృఢ సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా సేవ చేయొచ్చునని, విద్య ,వైద్య రంగాలలో పేద ప్రజలకు సేవ చేసి వారి మన్నలను పొందాలని, వారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వినోద్ రావు, నరసింహ చారి, కృష్ణ గౌడ్, సందీప్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎత్తరి రమేష్, సత్యనారాయణ సుధాకర్, సురేష్, సైదమ్మ, అనూష, రాహుల్, రాజు పాల్గొన్నారు.