నమస్తే శేరిలింగంపల్లి: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లాపూర్ డివిజన్ రామారావునగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని తొమ్మిది ఏళ్ల విజయవంతమైన సుపరిపాలన సందర్భంగా అల్లాపూర్ డివిజన్ రామారావునగర్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా.. కావలసిన వారికి ఉచిత మందులు, కంటి, ఈఎన్ టి పరీక్షలు ఉచితంగా చేశారు.
కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, పులిగోళ్ళ శ్రీనివాస్ , డివిజన్ అధ్యక్షులు విజయ్ , మల్లేష్, భాను ఇతర డివిజన్ నాయకులు, సీనియర్ నాయకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యం అందించి, ఉచితంగా మందులు అందించారు.