- బిఆర్ ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు
- సాధరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ లో చేరారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసానికి వెళ్లగా.. బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని, యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ఏ. శ్రీనివాసరావు, కే. రమేష్, ఎస్.కె మమ్మద్, ఎం.డి. హమీద్, వెంకన్న, బాబురావు, టెంటు శ్రీనివాస్, ఎం.డి. యూసుఫ్, ఎం.డి. మక్బూల్, ఎం.డి, రషీద్, ఎస్.కె షకీల్ పాషా, మహబూబ్ ఖాన్, ఎం.డి. అల్తాఫ్, నూర్ భాషా ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రి వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.