మూడోసారి అధికారం బీఆర్ఎస్ దే : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • బిఆర్ ఎస్ లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కాలనీ లోని బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాంచంద్రం ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసాయానికి వెళ్లగా అక్కడ గాంధీ వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాస్, రవి కుమార్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రఘు, మురళి మోహన్, ఈవీవీ సత్యనారాయణ, రవీందర్, సాయిరాం, సాయి కిరణ్, కళ్యాణ్, విశాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ యువత చూపంతా బీఆర్ఎస్ వైపే ఉందని, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.

వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫిజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, ప్రసాద్, కాశినాథ్ యాదవ్, శ్రీనివాస్, కోనేరు ప్రసాద్, వెంకట్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here