వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన చిరు వ్యాపారుల‌ను ఆదుకోవాలి

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ విన‌తి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవల‌ కురిసిన భారీ వ‌ర్షాల‌‌ కారణంగా వరద నీటి ప్రవాహంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్ లు ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరెక‌పూడి గాంధీని కోరారు. ఈ మేరకు వారు సోమవారం ఎమ్మెల్యే ఆరెక‌కపూడి గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే దసరా పండగను పురస్కరించుకుని ఆరెక‌పూడి గాంధీకి వారు దసరా శుభాకాంక్షలు తెలిపారు. వరద కారణంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ నల్లగండ్ల కూరగాయల మార్కెట్ తో పాటు చుట్ట ప‌క్క‌ల ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తుల దుకాణాలు పూర్తిగా నీట‌ మునిగి తీవ్రంగా నష్టపోయారని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆరెక‌పూడి గాంధీకి వివరించారు. వరదల్లో నష్టపోయిన వ్యాపారస్తులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్, పవన్ ఉన్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్, దుర్గం వీరేశం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here