గచ్చిబౌలి మధురానగర్‌లో SIR ప్రత్యేక రివిజన్.. ఓటరు జాబితాను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఉన్న‌ మధురానగర్ కాలనీలోని మహిళా భవన్‌లో మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. 11, 12 బూత్‌ల బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో కలిసి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, డూప్లికేట్ పేర్ల తొలగింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజమ్మ, రమేష్ గౌడ్, దార్గుపల్లి నరేష్, బాలమణి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here